![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -33 లో..... రామారావు ఇల్లు వెతుక్కుంటూ జానూ వెళ్తుంటే అడ్రెస్ నేను చెప్పాలా అని సూర్య మాస్క్ వేసుకొని తనని ఆటపట్టిస్తాడు. మాస్క్ తీసి సూర్యని చూసి నువ్వా అని జానూ అంటుంది. నీకు ఎందుకు ఇంత కష్టంలే గానీ నాకు అడ్రెస్ తెలుసు వెళదాం పదా అని సూర్య తనని బైక్ పై ఎక్కించుకొని వెళ్తాడు. రామారావు గారు అంటూ జానూ పిలుస్తుంది. రామారావు వస్తుంటే తన కొడుకు అతడిని ఆపుతాడు. తనే బయటకు వెళ్లి ఎవరు కావాలని అడుగుతాడు. రామారావు కావాలని జానూ అనగానే అతను హాస్పిటల్ లో ఉన్నాడని అబద్ధం చెప్తాడు.
మాకు తోట అమ్మాడు.. ఇప్పుడు మాకు రిజిస్ట్రేషన్ కావాలి.. ఈ తోటతో మా అక్క పెళ్లి లింక్ అయి ఉందని జానూ అనగానే ఈ తోట ఎవరికి అమ్మలేదు.. ఇదివరకు సింహాద్రి అని వచ్చాడు.. ఇలాగే అడిగాడు. ఇక ఇలా రాకండి అని వాళ్లని పంపిస్తాడు. దాంతో జానూ డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత నందు, కిన్నెర నడుచుకుంటూ వస్తుంటే మురళి వాళ్ళని చూస్తాడు. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు నీ మొహానికి NRI సంబంధం అంటున్నావ్.. నీకు అంత సీన్ లేదని అంటారు. దాంతో వాళ్ళని కొట్టాలని రాయి పట్టుకుంటుంది నందు. అది చూసి వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. రా నందు బైక్ మీద ఎక్కు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని మురళి అంటాడు. అవసరం లేదని తనతో కోపంగా మాట్లాడుతుంది నందు.
మరొకవైపు రామారావు కొడుకు సింహాద్రికి ఫోన్ చేసి నాకు ఏ ప్రాబ్లమ్ రాదన్నావ్.. ఎవరో వచ్చి తోట గురించి అడిగారు.. మా నాన్న చూస్తే న్యాయం ధర్మం అంటూ మాట్లాడుతాడని అతను అంటాడు. అవన్నీ నువ్వు చూసుకోమని సింహాద్రి అంటాడు. జానూని తీసుకొని సూర్య ఇంటివరకు వస్తుంటే వద్దు ఇక్కడే దింపు గౌతమి ఇలా అంటుందని జానూ అంటుంది. ఆ తర్వాత బ్యాంకు మేనేజర్ ని సింహాద్రి తిడతాడు. ఏ పని చేతకాదని కోప్పడతాడు. తరువాయి భాగంలో బ్యాంక్ వాళ్ళు వచ్చి శంకర్ ఇంటిని సీజ్ చేస్తారు. జానూ తన కుటుంబాన్ని తీసుకొని బయటకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |